అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి

జడ్పీ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాజన్న సిరిసిల్ల జిల్లా :అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ పిలుపునిచ్చారు.జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.

 Officers Of All Departments Should Move Ahead In Coordination , Coordination, Of-TeluguStop.com

ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడారు.వర్షాకాలం నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని, వారికి సేవలు అందించాలని సూచించారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించాలని సూచించారు.

అంతకుముందు ఆయా శాఖల అధికారులు తమ శాఖ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీ.ఎఫ్.ఓ బాలమణి, జడ్పీ సీఈవో ఉమా రాణి ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube