ఆన్‌లైన్‌లో బస్‌ పాస్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల బస్‌ పాస్‌ గడువు పొడిగింపు ఆన్‌లైన్‌లో బస్‌ పాస్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలోని అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల రాయితీ బస్‌ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పొడిగించింది.ప్రస్తుత బస్‌ పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది.

 Online Acceptance Of Bus Pass Applications Has Started, Bus Pass For Accredited-TeluguStop.com

తాజాగా సెప్టెంబర్‌ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్‌ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు బస్‌ పాస్‌ల గడువును మూడు నెలల పాటు టీజీఎస్‌ఆర్టీసీ పొడిగించింది.

అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల రాయితీ బస్‌ పాసుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.కాలపరిమితి పొడిగించిన ఈ బస్‌ పాస్‌లను గతంలో మాదిరిగానే https://tgsrtcpass.com/journalist.do?category=Fresh లింక్‌ పై క్లిక్‌ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తుల్లో జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను నమోదు చేయడంతో పాటు ఫొటో, అక్రిడిటేషన్‌ కార్డులను విధిగా అప్‌లోడ్‌ చేయాలి.

బస్‌ పాస్‌ కలెక్షన్‌ సెంటర్‌నూ ఎంపికచేసుకోవాలి.ఈ దరఖాస్తులను సమాచార, పౌరసంబంధాల శాఖ ఆన్‌ లైన్‌ లో దృవీకరించిన తర్వాత జర్నలిస్టులకు బస్‌ పాస్‌లను టీజీఎస్‌ఆర్టీసీ జారీ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube