లక్ష్య సాధనకు.. మహర్షి భగీరథుడి నీ స్ఫూర్తిగా తీసుకోవాలి : జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్

రాజన్న సిరిసిల్ల జిల్లా :లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించారని జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్  పేర్కొన్నారు.గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో  వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలను నిర్వహించారు.

 To Achieve The Goal.. Maharishi Bhagiratha Should Be Taken As Your Inspiration:-TeluguStop.com

ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ నీటిని దివి నుంచి భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని అన్నారు.

ఆయన్ను స్మరించుకోవడం, జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు.మహనీయుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

మహనీయుల జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ ao బి గంగయ్య, సహాయ వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube