రైతన్నల కోసం పోరాటం చేస్తే అక్రమ కేసులా

బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి అన్నారు.పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వర్షానికి తీవ్రమైన పంట నష్టం జరిగిందని, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందన్నారు.

 Fighting For The Farmers Is An Illegal Case , Illegal Case, Farmers-TeluguStop.com

ఇంతవరకు కొనుగోలు మొదలు పెట్టకపోవడంతో ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని,ఈ తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు.వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి వడగల్ల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరాకు 25000 నష్ట పరిహారం చెల్లించాలని, తడిసిపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

బుధవారం రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతూ ఉంటే అక్రమ కేసులు పెట్టడం ఏంటి అని అన్నారు.పోలీసులకు ఒకటి చెప్తున్నామని వచ్చేది బిజెపి ప్రభుత్వం ఇది మీరు తెలుసుకోండి అని అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు.

రైతులు ఊరికే రోడ్డెక్కలేదని ఆ మొలకెత్తిన వడ్లు అధికారులకు ప్రభుత్వానికి కనబడడం లేదా అని వారన్నారు.ఇంతవరకు ఏ ఒక్క అధికారి వచ్చి పంట నష్టం అంచనా వేయలేదని తెలిపారు.

బుధవారం రైతులు నిరసన తెలుపుతూ ఉంటే ఎమ్మార్వో వచ్చి చూసి చూడనట్టు పక్కనుండి వెళ్లిపోయారని రైతులు అన్నారు.అధికారులే సమాధానం చెప్పలేకపోతే ఎవరు చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టి ప్రసక్తేలేదని ప్రభుత్వానికి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మేడిశెట్టి బాలయ్య, గుర్రాల రాజిరెడ్డి,గడ్డం రవి, రైతులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube