1.లొకేష్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వంశీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లొకేష్ నిర్వహించిన జూన్ మీటింగ్ లో హఠాత్తుగా వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని ,దేవేందర్ రెడ్డి ,రమ్య శ్రీ తదితరులు ప్రత్యక్షమయ్యారు.
2.ఎయిర్ ఫోర్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీ
భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మొత్తం 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
3.టిటిడి ఉద్యోగిపై దాడి నిందితుడు అరెస్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి వెంకటరత్నం పై దాడి కేసులో నిందితుడు బబ్లూ అలియాస్ పృథ్వి రాజ్ ను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు.తిరుమలలో గది విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది.
4.వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి మృతి
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానస్పద రీతిలో మృతి చెందారు.
5.ఎన్టీఆర్ పై సుప్రీంకోర్టు సీజేఐ ప్రశంసలు
మహానటుడు ఎన్టీఆర్ తో తనకు ఎంతో అనుబంధం ఉండేదని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమణ అన్నారు.
6.ఈ నెల నుంచి తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ
తెలంగాణలోని రేషన్ ర్డుదారులకు ఈ నెల నుంచి వచ్చే డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
7.నురూప్ శర్మ తో పాటు మరో ఏడుగురి పై కేసు
బిజెపి నుంచి సస్పెన్షన్ వేటు వేసిన నూరు శర్మ, ఆ పార్టీ మాజీ నేత నవీన్ జిందాల్, జర్నలిస్టు సభా నక్వి తో పాటు, పలువురు పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.మహమ్మద్ ప్రవక్త పై నూరూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే
8.రాష్ట్రపతి ఎన్నికలకు నేడు షెడ్యూల్
రాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు షెడ్యూల్ విడుదల చేసింది.
9.ఎన్ ఐ ఏ సోదాలు
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది.అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తరపున ప్రచారం నిర్వహించడం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో చెన్నైలోని అనుమానితుల పై దాడులు నిర్వహిస్తోంది.
10.రాత్రి 7 వరకు గ్రంథాలయాలు తెరిచే ఉంటాయి
పోటీ పరీక్ష దారులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగార్డుల సౌలభ్యం కోసం నిత్యం ఉదయం 8 నుంచి 7:00 వరకు హైదరాబాద్ లోని కొన్ని గ్రంథాలయాలను తెరిచి ఉంచాలని నిర్ణయించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
11.ఉద్యోగార్డుల కోసం స్టడీ మెటీరియల్ విడుదల
గ్రూప్ వన్ పోస్టులతో పాటు వివిధ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు పోటీ పడే ఉద్యోగార్థుల కోసం ‘తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం – 2022 ‘ ఈ పుస్తకాన్ని రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రచురించిందని ఆ శాఖ డైరెక్టర్ మీరా తెలిపారు.
12.పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : కేటీఆర్
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ కేసులో నిందితులుగా ఉన్న మైనర్ల ను మేజర్లు గా పరిగణించి విచారించేందుకు జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతి కోరనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ధ్రువీకరించడం పై కేటీఆర్ స్పందించారు .పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన ప్రకటించారు.
13.బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతల సమావేశం
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.
14.మెడికల్ సీట్ల వివాదంపై సుప్రీం కోర్టులో ముగిసిన వాదనలు
మెడికల్ సీట్ల వివాదంపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. మెడికల్ సీట్ల విషయం శుక్రవారం తీర్పు వెలువడనుంది .
15.మరో రెండు రోజుల్లో వర్షాలు
మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
16.రోజా పై సోము వీర్రాజు కామెంట్స్
బీజేపీపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. ఆంధ్రాలో బిజెపి కి ఓటు ఎవరు వేస్తారని మంత్రి రోజా చెప్పడం సరికాదని, ఎవరో రాసిస్తే ఆమె చదువుతారు అంటూ ఆయన విమర్శించారు.
17.జగన్ పై లోకేష్ కామెంట్
పదో తరగతి విద్యార్థులవి ఆత్మహత్య కాదని , ప్రిజనరి జగన్ ప్రభుత్వ హత్యలే అంటూ ఆయన విమర్శించారు.
18.తెలంగాణ గవర్నర్ పై నారాయణ కామెంట్స్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తలపెట్టిన మహిళా దర్బార్ కార్యక్రమంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేశారు.గవర్నర్ తమిళ సై లక్ష్మణ రేఖ దాటుతున్నరని నారాయణ విమర్శించారు.
19.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 7240 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.భక్తులకు టిటిడి శుభవార్త
సర్వదర్శనం భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ లేకుండా గంటన్నర వ్యవధిలోనే దర్శన సౌకర్యం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
.