సామాజిక భద్రతా ఛత్రం పరిధిలోకి విదేశాల్లోని భారతీయ కార్మికులు .. కేంద్రం యోచన..!!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఆశయం కావొచ్చు.

 Modi Govt Making Efforts To Bring Workers Employed Abroad Under Social Security-TeluguStop.com

ఆర్ధిక సమస్యలు కావొచ్చు.కారణమేదైనా పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరిగిందని అనేక గణాంకాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో అక్కడ జాత్యహంకార దాడులు, రోడ్డు ప్రమాదాలు, ఇతర చిక్కుల్లో పడి కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.పని ప్రదేశాల్లో జరిగే హింస దీనికి అదనం.

ఈ నేపధ్యంలో విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల శ్రేయస్సుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

దీనిలో భాగంగా సామాజిక భద్రతా ఒప్పందాల ఛత్రం కిందకి భారతీయులను తీసుకురావాలని భావిస్తోంది.

ఇందుకోసం త్వరలో జరగనున్న జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్ఓ)ను వినియోగించుకోనుంది.ఈ సదస్సుకు భారత్ నుంచి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సహా సభ్య దేశాల కార్మిక శాఖ మంత్రులు హాజరుకానున్నారు.

దీనిపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులను సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకురావడానికి మరిన్ని దేశాలతో మనదేశం చర్చలు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు ఫ్రేమ్‌వర్క్ కార్యాచరణ కింద సంబంధిత విదేశీ ప్రభుత్వాలు భారతీయ ప్రవాస కార్మికుల ప్రావిడెంట్ ఫండ్స్ ఖాతాలకు సంబంధించిన వివరాలను కేంద్రానికి అందించాయి.

కార్మిక చట్టం ప్రకారం సామాజిక భద్రతా వలయం కింద ప్రవాస కార్మికులను కవర్ చేయడానికి ఇది వెసులుబాటు కల్పిస్తుంది.ఇప్పటి వరకు కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, నార్వే, స్విట్జర్లాండ్ , ఫ్రాన్స్ సహా 19 దేశాలతో భారత్ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకుంది.

బ్రెజిల్‌తో కూడా అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ.ఇంకా ఇది అమల్లోకి రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube