మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పేరిట కొత్త స్కీమ్

కరీంనగర్, ఏప్రిల్ 13: అన్ని వర్గాల ప్రజల చేరువకు ఇప్పటికే వివిధ సేవలను విస్తృతం చేసిన తపాల శాఖ ఇటీవలే పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో పాటుగా మహిళలకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది.మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రత్యేకంగా ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్-2023′ పేరిట కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది.

 A New Scheme Called Mahila Samman Savings Certificate-TeluguStop.com

గత మార్చి 31నుంచి అమలులోకి వచ్చిన ఈ స్కీమ్ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలనికరీంనగర్ డివిజనల్ పోస్టల్ ఎస్పీ వై.వెంకటేశ్వర్లు కోరారు.ఈ మేరకు గురువారం పోస్టల్ ఎస్పీ ఈ స్కీమ్ వివరాలతో ఒక ప్రకటన విడుదల చేశారు.మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాను మహిళలు వారి కోసం ఓపెన్ చేసుకోవచ్చునని, వారి సంరక్షణలో మైనర్ బాలికలకు కూడా ఓపెన్ చేసుకోవచ్చునని తెలిపారు.

రూ.1,000 నుండి మొదలు కొని రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చునని, ఈ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ వస్తుందని వివరించారు.ఇంకా పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసులలో సంప్రదించాలని సూచించారు.అలాగే అన్ని వర్గాల ప్రజలకు పోస్టల్ పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఎస్పీ ఆ ప్రకటనలో ప్రజలను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube