రాత్రి వేళల్లో బెల్ట్ షాపుల తనిఖీలు చేస్తున్న వైన్స్ సిబ్బంది

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలంలో మద్యం మాఫీయా రెచ్చిపోతుంది.మండలంలోని రెండు మద్యం షాపులు సిండికేట్ ముఠాగా ఏర్పడి ఒక్కో క్వార్టర్ పైన ఎమ్మార్పీ కంటే రూ.15 అదనంగా వసూల్ చేస్తూ బెల్ట్ షాపులను సపరేట్ కౌంటర్ పెట్టిమరీ మద్యం సరఫరా చేస్తున్నారని మండల ప్రజలు,మందుబాబులు ఆరోపిస్తున్నారు.ఇదే అదునుగా గ్రామాల్లోని బెల్ట్ షాపుల వారు క్వార్టర్ పై మరో రూ.15 అదనంగా విక్రయిస్తూ ఇద్దరూ కలిసి సామాన్యుడి మీద మొత్తం రూ.30 భారాన్ని రుద్దుతున్నారని వాపోతున్నారు.ఇదేంటని బెల్ట్ షాపుల వారిని అడగగా కోదాడలో లేని సిండికేట్ అనంతగిరి మండలంలో ఏర్పాటు చేసి బెల్ట్ షాపులకు రూ.15 అదనంగా తీసుకొని వేస్తున్నారని,మేము తమ కూలీ చూసుకొని అమ్ముతున్నామని చెబుతున్నారు.

 Wines Staff Inspecting Belt Shops At Night, Wines Staff ,inspecting, Belt Shops-TeluguStop.com

ఇదిలా ఉంటే మండలంలో వైన్స్ యాజమాన్యమే ఎక్సైజ్ పోలీసుల అవతారమెత్తి గ్రామాల్లో బెల్ట్ షాపులను తనిఖీలు చేస్తున్నారని, ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నప్పుడే నేరుగా ఇంటిలోకి వెళ్ళి సోదాలు నిర్వహిస్తున్నారని,అనంతగిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వైన్స్ షాప్ ఓనర్ తానే ఎక్సైజ్ సిఐని అంటూ గ్రామంలో ప్రజలను,కిరాణా (బెల్ట్) షాపుల వాళ్ళని భయబ్రాంతులకు గురిచేయడంతో స్థానిక యువకులు అడ్డుతగిలి ప్రశ్నిస్తే కోదాడ ఎమ్మెల్యే గారే సిండికేట్ పెట్టుకోమన్నారని,నెలనెలా వాటాలు పంపిస్తున్నామని,మీరు నన్ను ఏమి చేయలేరని జులం ప్రదర్శించడం గమనార్హం.గతంలో మద్యం సిండికేట్ మాఫియా అంటూ విమర్శలు చేసిన నాయకులే ఇప్పుడు సిండికేట్ దందా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వైన్స్ పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube