పటేల్,పట్వారి వ్యవస్థ ఉంటే భూ సమస్యలు ఉండేవి కాదు: వి.హనుమంతరావు

సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వం అవలంభించిన విధానాల తప్పిదాల వల్లనే నేడు రాష్ట్రంలో అనేకమంది రైతులు, సామాన్య ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు,మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు.

 V. Hanumantha Rao Said There Would Have Been No Land Problems If Patel And Patwa-TeluguStop.com

మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అతను మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మేడం ముత్తయ్యకు వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరులు కబ్జా చేయడం బాధాకరమన్నారు.రైతుకు వచ్చిన భూ సమస్య విషయంలో అప్పటి రెవెన్యూ అధికారులదే పూర్తి తప్పిదమన్నారు.

బాధితుల నుంచి వివరాలు తెలుసుకునేందుకు తాను గ్రామానికి వెళ్లానని వారితో మాట్లాడానని చెప్పారు.ధరణి లోపాలను అడ్డుపెట్టుకొని గత పాలకులు అధికారులు ఎన్నో పొరపాట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు పట్టాదారులను కాదని అనర్హులకు పట్టాలు చేశారని అన్నారు.ధరణిని పూర్తి ప్రక్షాళన చేయ్యాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.

గతంలో పటేల్ పట్వారి వ్యవస్థ గ్రామాల్లో ఉన్నప్పుడు ఇలాంటి భూ సమస్యలు లేవని,ఆ వ్యవస్థ రద్దు కావడం, దానికి తోడు ధరణి రావడంతో అనేక భూ సమస్యలు పెరిగాయన్నారు.ఆత్మహత్యాయత్నాలు సమస్యలకు పరిష్కారాలు కావన్నారు.

అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటానని సమస్యలు పరిష్కారమయ్యే వరకు బాధితుల పక్షాన తాను ఎల్లప్పుడూ అండగా నిలబడుతాని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆంజద్ అలీ,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube