సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం విద్యా,వైద్య రంగాలకు నిధులు కేటాయించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక హుజూర్ నగర్ డివిజన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ బుధవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా పౌరస స్పందన వేదిక జిల్లా కార్యదర్శి సుంకర క్రాంతి కుమార్ మాట్లాడుతూ2023-24 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 10%శాతం,వైద్య రంగానికి 6% శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలోడివిజన్ అధ్యక్షులు పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, న్యాయవాదులు నెట్టే సత్యనారాయణ,మాధవ రెడ్డి,రవికుమార్, అంజయ్య,రమణారెడ్డి,యాదగిరి,జుట్టుకొండ సత్యనారాయణ,బట్టుపల్లి ప్రవీణ్ కుమార్,సురేష్, శ్రీనివాస్,నవీన్,శీను నాయక్,సురేష్ నాయక్, జీవికేమూర్తి,ప్రదీప్తి,మౌనిక తదితరులు పాల్గొన్నారు.