పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లను ఫాం-12 లో ఏప్రిల్ 26వ తేదీలోగా ఇవ్వాలి

నల్లగొండ జిల్లా:ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రిసైడింగ్, అసిస్టెంటు ప్రిసైడింగ్,ఇతర పోలింగ్,పోలీసులు,సెక్టారు,బూత్ లెవెల్ అధికారులు, డ్రైవర్లు,క్లీనర్లు,వీడియో గ్రాఫర్లు,బందోబస్తు కొరకు ఉత్తర్వులు అందుకున్న ఎన్సీసీ,ఎన్ఎస్ఎస్,ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఇతర యూనిఫాం వారు పనిచేస్తున్న జిల్లాలోనే సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు ఫామ్-12 అప్లికేషన్లను (ఒకటి పార్లమెంటుకు,రెండవది అసెంబ్లీకి),ఎన్నికల విధుల నియామక ఉత్తర్వులు మరియు ఓటరు కార్డు ప్రతిని జతపరిచి ఏప్రిల్ 26 లోగా సమర్పించవలెను.ఓటు వేయడానికి ఫెసిలిటేషన్ ను శిక్షణా కేంద్రాల వద్ద మరియు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేయబడును.

 Postal Ballot Applications Should Be Submitted In Form-12 By 26th April , Form-1-TeluguStop.com

“ఓటు వేయడానికి ఆఖరి రోజు మే 8.ఈ ఫెసిలిటేషన్ వివరాలను ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థులకు, రాజకీయ పార్టీ ప్రతినిధులకు మరియు ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులకు ముందుగానే సమాచారం అందచేయబడును.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube