సూర్యాపేట జిల్లా:కోదాడ మండల పరిధిలోని గుడిబండ కాపుగల్లు గ్రామాల మధ్య రహదారి వెంట మిషన్ భగీరథ పైపులైన్ల కోసం ఇటీవల ఆరు అడుగులలోతు గుంత తవ్వి గూనలు వేశారు.కనీసం ఆ గుంత చుట్టూ ఎటువంటి రక్షణ కానీ, ప్రమాద హెచ్చరికలు కానీ ఏర్పాటు చేయలేదు.
దీంతో అటుగా వచ్చిపోయే వాహనదారులు ఎప్పుడు ప్రమాదాల బారిన పడతారోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాహనాలను నడపవలసి వస్తుందని వాపోతున్నారు.అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.