సూర్యాపేట జిల్లా: మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన రావులపెంట వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని ఆటోమేటిక్ స్టార్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
పంట సీజన్ అయిపోవడంతో పొలం వద్దకు వెళ్ళేదని,ఆదివారం ఉదయం వెళ్ళి చూడగా మొత్తం పగులగొట్టి ఉందని, దీనితో తనకు రూ.5వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు రావులపెంట వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.







