సూర్యాపేట జిల్లా:పంట చేతికొచ్చే సమయానికి నీళ్ళు అందక ఎండి పోతున్నాయని, వెంటనే పెన్ పహాడ్ మండలం(Penpahad Mandal )లోని ధర్మాపురం, భక్తాళపురం,రంగయ్యగూడెం, తుల్జారావుపేట గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం ఆత్మకూర్ (ఎస్) మండలం కొటినాయక్ తండా వద్ద ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు ( Farmers )మాట్లడుతూ చివ్వెంల మండలం,పెన్ పహాడ్ మండలాలకు నీళ్లు ఇవ్వడంలో అధికారులు సరైన న్యాయం చేయడం లేదని ఆరోపించారు.వెంటనే మా గ్రామాలకు నీళ్ళు అందేలా చూసి,పంటలు ఎండిపోకుండా కాపాడాలని డిమాండ్ చేశారు.
రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సిబ్బందితో అక్కడికి చేరుకున్న ఆత్మకూర్(ఎస్) ఎస్ఐ సైదులు రైతులకు సర్దిచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు తోగరు లింగయ్య,సాదే సీతయ్య,కర్ణాకర్,శంకర్, భాస్కరాచారి,వెంకటేశ్వర్లు,అజయ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.