విద్యుత్ తీగలను అలుముకున్న వేపచెట్లు...!

సూర్యాపేట జిల్లా:మోతె మండల ( Mothey mandal )కేంద్రంలోని ప్రధాన కూడలిలో విద్యుత్ తీగలను వేపచెట్లు అలుముకొని ప్రమాదకరంగా మారింది.ఆ మార్గం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వెళ్తుంటారు, అతి సమీపంలో స్టేట్ బ్యాంక్,మరో పక్కన బ్యాంక్ సర్వీసు కేంద్రంఉండడంతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతోవచ్చిపోయే జనం చిన్న గాలి వీచినా మంటలు లేచి,ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ భయంతో వణికిపోతున్నారు.

 Neem Trees Hit Power Lines , Neem Trees , Power Lines , Mothey Mandal , Surya-TeluguStop.com

తీగలపై వేపచెట్ల కొమ్మలు( Neem Tree ) తొలగించాలని విద్యుత్ సిబ్బందికి,అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడని,ప్రమాదం జరిగి ప్రాణ నష్టంతో పాటు అస్తినష్టం జరిగితే ఎవరు బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ అధికారులు నెలనెలా బిల్లులు వసూలు చేయడంపై పెట్టే శ్రద్ధ ప్రజల ప్రాణాలపై ఉండదా అని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా విద్యుత్ అధికారులు( Electricity authorities ) స్పందించి తక్షణమే వేప కొమ్మలను తొలగించాలని గ్రామరైతు ముస్కు కోటిరెడ్డి కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube