డీజీపీతో వీడియో కాన్ఫరెన్స్

సూర్యాపేట జిల్లా:జిల్లాల అధికారులు,కమీషనర్లతో రాష్ట్ర డీజీపీ గురువారం రాష్ట్రస్థాయి పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తీవ్ర నేరాలు జరగకుండా విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని,కేసులు పెండింగ్ లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నమోదు చేయాలని, పోలీస్ ఫంక్షనల్ వర్టికల్ విభాగాలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.

 Video Conference With Dgp-TeluguStop.com

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్,అదనపు ఎస్పీ రితిరాజ్ హాజరై జిల్లాలో నమోదౌతున్న పిర్యాదులు,కేసులు,కేసుల దర్యాప్తు,వర్టికల్ విభాగాలు,మహిళా భద్రత,రోడ్డు భద్రత మొదలగు అంశాలపై డీజీపీకి వివరించారు.ప్రజా పిర్యాదులపై పెట్రో కార్,బ్లూ కోట్స్ సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై ప్రజలను చైతన్య పరుస్తున్నామని,ప్రతి సమస్యాత్మక ప్రాంతాన్ని ప్రతిరోజూ తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ పెంచామని వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నేరాల నివారణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

కేసుల స్థితిగతులను అంతర్జాలం నందు నమోదు చేస్తున్నామని అన్నారు.రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడుతున్నారని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.

తప్పక హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.రోడ్డు భద్రత జాగ్రత్తలు పాటించాలని,అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ డిఎస్పీలు రఘు,మోహన్ కుమార్,రెహమాన్,సిఐలు విఠల్ రెడ్డి,రాజేష్,సూర్యాపేట పట్టణ సిఐ ఆంజనేయులు, మునగాల సిఐ ఆంజనేయులు,పి ఎన్ డి ప్రసాద్, రామలింగారెడ్డి,నర్సింహారావు,ఎస్బి సిఐ శ్రీనివాస్, నర్సింహ గౌడ్,ప్రవీణ్,రవి,ఐటీ కోర్ ఎస్ఐ శివకుమార్,ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube