కలెక్టర్ ని సైతం వదలని సైబర్ నేరగాళ్లు

సూర్యాపేట జిల్లా:జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు.సామాన్యులనే కాదు జిల్లా అధికారులు సైతం సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతూ ఉన్నారు.

 Cyber Criminals Who Do Not Leave Even The Collector-TeluguStop.com

రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో సైబర్ నేరాలు వెలుగులోకి వచ్చాయి.కొంతకాలం పోలీసు అధికారుల ఫేస్ బుక్, వాట్సాప్ లను హ్యాక్ చేసి కిందిస్థాయి అధికారులను బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్ళు ఆదివారం ఏకంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ వాట్సాప్ ను హ్యాక్ చేసి జిల్లా వైద్యాధికారి కోటా చలం ను బురిడీ కొట్టించారు.

మీడియా,సోషల్ మీడియాలో సైబర్ నేరాలపై ప్రకటనలు వస్తున్నా కూడా సైబర్ నెరగాళ్లు సరికొత్తగా ఆలోచిస్తూ అమాయకులతో పాటు అధికారులను,రాజకీయ నేతలను కూడా నిలువునా దోచేస్తున్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా వైద్య శాఖ అధికారి కోటాచలం కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చలో పడి ఒక లక్ష 40 వేల రూపాయలు సొమ్మును పోగొట్టుకున్నాడు.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ వాట్సాప్ డీపీని హ్యాక్ చేశారు.అంతటితో ఆగకుండా సూర్యాపేట జిల్లా వైద్యాధికారికి వాట్సాప్ లో కలెక్టర్ మెసేజ్ చేసినట్లు చేసి నాకు అర్జెంటుగా ఒక లక్షా 40 వేలు కావాలని,ఐ నీడ్ అర్జెంట్ మనీ అని మెసేజ్ పెట్టడంతో వెంటనే జిల్లా వైద్యాధికారి 1,40,000 విలువైన అమెజాన్ కార్డులు ఆరుగురి అకౌంట్ల ద్వారా పంపించారు.

వెంటనే అదే నెంబర్ నుంచి ఇంకో 20,000 పంపించమని సైబర్ నేరగాడు అడగగా అనుమానం వచ్చి,అదే నెంబర్ కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.అప్పుడు సైబర్ నేరగాల ఉచ్చులో పడిపోయాయని గమనించి వెంటనే సైబర్ సెల్ 1930కి కంప్లీట్ చేయడం జరిగిందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube