అవిశ్వాసం మధ్యాహ్ననానికి వాయిదా...!

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణమ్మ,వైస్ చైర్మన్ పుట్ట మధులపై( Annapoornamma Perumal, Putta Madhupai )పెట్టిన అవిశ్వాస సమావేశం శనివారం (ఈ రోజు) మధ్యాహ్నానానికి వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు అవిశ్వాస పరీక్షకు మున్సిపల్ కౌన్సిలర్లు హజరు కావాల్సి ఉండగా 11:30 గంటల వరకు సమయాన్ని పొడిగించామని, అయినా ఒక్కరు కూడా హాజరు కాకపోవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేసినట్లు చెప్పారు.3 గంటల లోపు అందరూ హాజరుకావాలని సర్క్యులర్ జారీ చేసి,దానిని నోటీస్ బోర్డులో పెట్టాలని మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డిని ఆదేశించారు.ఈ అవిశ్వాస తీర్మాన సమావేశానికి అదనపు కలెక్టర్,మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు.ఇదిలా ఉంటే అవిశ్వాస సమావేశం వాయిదా వేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను కోరినట్లు తెలుస్తోంది.32 మంది ఉన్న అసమ్మతి శిబిరం నుండి ఇద్దరు కౌన్సిలర్లు జారుకోవడంతో కోరమ్ లేక కౌన్సిలర్లు హజరు కాలేదని సమాచారం.మరి మూడు గంటల వరకు ఏం జరగనుందనే టెన్సన్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది.

 Adjournment Of Infidelity To The Afternoon , Annapoornamma Perumal, Putta Madhup-TeluguStop.com

ఈ అవిశ్వాస సమావేశంలోకి వెళ్లేందుకు డిపిఆర్ఓ మీడియా పాసులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొందరు విలేకర్లు ఆరోపించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube