1.ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు అవార్డులు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.ఈనెల 23న నియోజకవర్గల్లో మీటింగ్ లు పెట్టి అవార్డులు ఇవ్వబోతున్నట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
2.తెలంగాణలో కలిపేయండి
భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణ గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు.
3.బండి సంజయ్ కామెంట్స్.

మరో ఐదు నెలలు ఆగండి తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కారు నిషేధించబోతున్నారు అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
4.ఎన్ ఐ ఏ సోదాలు
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ ఈరోజు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ , మధ్య ప్రదేశ్ లోని ఆరు రాష్ట్రాల్లోని 100 కి పైగా సోదాలు నిర్వహించింది.
5.శ్రీ లక్ష్మి మహా యజ్ఞం లో పాల్గొన్న జగన్

విజయవాడలో జరుగుతున్న శ్రీ లక్ష్మి మహా యజ్ఞం లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు.
6.ఐపీఎల్ లో నేడు
ఐపీఎల్ లో నేడు పంజాబ్ మ్యాచ్ జరగనుంది.ధర్మశాల వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
7.తిరుమల సమాచారం

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్ని నిండి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది.
8.జిల్లా సమీక్ష కమిటీ సమావేశం
నేడు రాజమండ్రి కలెక్టరేట్ లోని జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది.
9.విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మంత్రి ఆది మూలపు సురేష్ పాల్గొన్నారు.
10.అవినాష్ రెడ్డి పర్యటన
కడప జిల్లా లింగాల మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించనున్నారు.రెండు కోట్లతో నిర్మించిన లింగాల గుడిగట్టు ఎత్తిపోతల పథకాన్ని అవినాష్ రెడ్డి ప్రారంభించనున్నారు.
11.హోం మంత్రి పర్యటన

తూర్పుగోదావరి జిల్లాలో నేడు హోంమంత్రి తానేటి వనిత పర్యతీస్తున్నారు.కొవ్వూరు టౌన్ నాలుగో వార్డు నందు జరగనున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.
12.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరి పట్టణంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.
13.వేరుశనగ విత్తనం కోసం రైతు పేర్లు నమోదు
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో నేటి నుంచి వేరుశనగ విత్తనం కోసం రైతు పేర్లు నమోదు కార్యక్రమం జరగనుంది.
14.యువ గళం పాదయాత్ర
కర్నూలు జిల్లాలో నేడు 102 వ రోజు లోకేష్ యువ గళం పాదయాత్ర జరుగుతోంది.
15.భద్రాద్రి రాముడి సేవలో గవర్నర్

భద్రాద్రి సీతారాముల వారిని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సందర్శించారు.ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో గవర్నర్ ఉన్నారు.
16.నేడు బీఆర్ఎస్ కీలక భేటీ
ఈరోజు టిఆర్ఎస్ జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది.
17.భట్టి విక్రమార్క కామెంట్స్

ఆరు నెలలు మీ భూమిలోను మీరు కాపాడుకుంటే 6 నెలలు తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మీ భూములు కాపాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
18.కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి గా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యనే తిరిగి కాంగ్రెస్ ఎంపిక చేసింది.
19.జగన్ పై చంద్రబాబు ఫైర్

వందేళ్ల చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ జాతరను వైసీపీ వదిలిపెట్టలేదు అని, తన ప్రచారం కోసం అడ్డగోలుగా వాడేసుకుంటోందని జగన్ పై చంద్రబాబు విమర్శలు చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 56,300
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 61,420
.