సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార బ్యాంకుల అభివృద్ధికి కృషి చేస్తుందని, రాష్ట్రంలో సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకులకు ధీటుగా రైతులకు సేవలు అందిస్తున్నాయని,సహాకార బ్యాంకుల సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని,కోదాడ సహకార సంఘం రైతులకు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి ఆదర్శంగా నిలవాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.సోమవారం కోదాడ పట్టణంలోని సహకార వ్యవసాయ పరపతి సంఘం బ్యాంకు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లాకర్ సదుపాయం,బంగారు ఆభరణాల రుణాల సదుపాయాలను ఆయన ప్రారంభించారు.
అనంతరం రైతులకు ఎల్టి లోన్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సహకార సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గాలు సహకార వ్యవస్థను నిర్వీర్యం చేశాయని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార వ్యవసాయ పరపతి సంఘాలు ఎంతో పురోగతిని సాధించాయన్నారు.రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు వ్యవసాయ పనిముట్లు, పరికరాలను ఎరువులను అందజేస్తూ రైతులకు సహాయకారిగా ఉన్నాయన్నారు.
కేవలం రైతులకే కాకుండా వ్యాపారులకు కూడా సహకార బ్యాంకులు సేవలందిస్తున్నాయన్నారు.సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకులకు ధీటుగా ఖాతాదారులకు రుణ సదుపాయాలతో పాటు,పలురకాల సంక్షేమ సదుపాయాలు కల్పిస్తుయన్నారు.
కోదాడ వ్యవసాయ పరపతి సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలన్నారు.సంఘం అభివృద్ధికి చైర్మన్ ఆవుల రామారావు పాలకవర్గం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,ఎంపీపీ కవిత రాధారెడ్డి,జెడ్పిటిసి కృష్ణకుమారి శేషు,డాక్టర్ సుబ్బారావు,టిఆర్ఎస్ నాయకులు సత్యబాబు, హాల్తాఫ్ హుస్సేన్,టౌన్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్,సొసైటీ వైస్ చైర్మన్ నాని నరేష్,మున్సిపల్ కౌన్సిలర్లు ఖదీర్,గుండెల సూర్యనారాయణ, ఒంటిపులి శ్రీనివాస్,బెజవాడ శ్రవణ్,ఖాజా,డాక్టర్ బ్రహ్మం,జానకి,ఏసయ్య,గ్రంధాలయ చైర్మన్ రహీం, డిసిఓ శ్రీధర్,పాలకవర్గ సభ్యులు పార్వతి, వెంకటేశ్వర్లు,గోబ్రా,వెంకటయ్య,శ్రీనివాసరావు, చంద్రమౌళి,సీతారామయ్య,ప్రభాకర్ రావు,రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి,బాబు,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,బ్యాంక్ అధికారులు,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.