సూర్యాపేట జిల్లా: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో 85వేల అవినీతి జరిగిందని,దానికి మాజీ సీఎం కేసిఆర్,మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ సూర్యాపేట శాసనసభ ఎన్నికల్లో నైతిక విజయం నాదేనని,మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి గెలుపు కంటే వ్యతిరేకంగా వచ్చిన ఓట్లే ఎక్కువన్నారు.ఈ ఐదేళ్లు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా తానే ఉంటానని, నాయకుల,కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.6 గ్యారంటీలు పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని,సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ఆరు గ్యారంటీలో నిన్న రెండు గ్యారెంటీలను అమలు చేశామన్నారు.జగదీష్ రెడ్డి 10 సంవత్సరాలుగా బాధ్యతలు చేపట్టిన విద్యుత్ శాఖలో 85వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనికి మొదటి బాధ్యత కేసీఆర్,రెండో బాధ్యత జగదీష్ రెడ్డిదేనన్నారు.
బాధ్యులైన కేసీఆర్, జగదీష్ రెడ్డి,అధికారులపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళ జూనియర్ కళాశాల,యూనివర్సిటికి ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానన్నారు.మెడికల్ కళాశాల,కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపిస్తామని, మెడికల్ కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన జగదీష్ రెడ్డి మేనమామ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహిస్తూ నిరుద్యోగుల నుండి 63లక్షల 60వేలు వసూళ్లు చేసి ఉద్యోగం ఇవ్వక,డబ్బులు తిరిగి ఇవ్వకుండా అవినీతికి పాల్పడ్డాడని,దానిపై తగిన విచారణ జరిపిస్తామన్నారు.
కూరగాయల మార్కెట్ వ్యాపారులకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వ్యాపారులకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు.జిల్లా కేంద్రంలో రియాల్టర్లు అక్రమంగా భూములు ఆక్రమించారని,వారిపై విచారణ చేసి అట్టి భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామన్నారు.
కొన్నిచోట్ల బీఆర్ఎస్ నాయకులకు కేటాయించిన ప్రభుత్వ భూములపై విచారణ చేసి అర్హులైన పేదలకు వాటిని అందించేలా కృషి చేస్తానన్నారు.పదేండ్ల కాలంలో నియోజకవర్గంలో జరిగిన ప్రతి అవినీతిపై విచారణ చేపడుతామని, 24 గంటల పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
పట్టణంలో పాత రహదారి విస్తరణలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తానని,నేను ఎన్నికల ముందు సూర్యాపేట ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చాను,వాటిని నెరవేర్చడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానన్నారు.
సూర్యాపేటలో కొంతమంది రియల్టర్స్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి వ్యాపారం చేశారని, అట్టివారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని జైలుకు పంపిస్తామని,ఈ ఐదేళ్ల కాలంలో ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి కృషి చేస్తానని,తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వివిధ శాఖలో ఫైల్స్ మాయం కావడం చాలా దురదృష్టకరమన్నారు.
వాటిపై విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని,గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అక్రమాలను వెలికితీసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు.
తెలంగాణ విద్యుత్ సంస్థలో 85 వేల కోట్ల బకాయిలకు బాధ్యులైన కేసీఆర్,జగదీశ్ రెడ్డి, విద్యుత్ అధికారులపై తక్షణమే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం లోతుగా విచారణ చేపట్టి బాధ్యులైన అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని జైలుకు పంపే వరకు పోరాడుతామని, నియోజకవర్గ సమస్యల పట్ల అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు.దళితబంధు,బీసీ బంధులో జరిగిన అవినీతి విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన చర్యలు తీసుకునేలా చూస్తామని, 5 సంవత్సరాలు రాజకీయ కక్షలకు అవకాశం లేకుండా ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్టనాయకులు కొప్పుల వేణారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి,ధరావత్ వీరన్న నాయక్,తూముల సురేష్ రావు,కందాల వెంకట్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైరు శైలేందర్, పట్టణ పార్టీ అధ్యక్షులు అంజత్ అలీ,మున్సిపల్ ప్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్,రాష్ర్ట పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్ రావు,ఎస్సీసెల్ రాష్ర్ట వైస్ చైర్మన్ చింతమళ్ళ రమేష్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బాలు గౌడ్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్,నాగుల వాసు,ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.