చర్మం కాలడం.మనిషి సాగించే జీవన ప్రయాణంలో ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా ఈ సమస్యను ఫేస్ చేస్తారు.
ముఖ్యంగా వంట చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ముఖమో, చేతులో, వేళ్లో కలిపోతుంటాయి.అయితే కాలిన గాయాలు తగ్గినా.
వాటి వల్ల ఏర్పడే మచ్చలు మాత్రం పోనే పోవు.ఈ మచ్చల కారణంగా చర్మం అందహీనంగా కనిపిస్తుంటుంది.
ఈ క్రమంలోనే ఆ మచ్చలను పోగొట్టుకునేందుకు రకరకాల క్రీములు, ఆయిల్స్ వాడుతుంటారు.అయితే న్యాచురల్‌గా కొన్ని టిప్స్‌ను పాటిస్తే చాలా సులభంగా కాలిన గాయాల వల్ల ఏర్పడే మచ్చలను నివారించుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
ముందుగా ఒక గిన్నెలో తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్, రెండు స్పూన్ల టమాటా రసం, ఒక స్పూన్ పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మచ్చలపై అప్లై చేసి స్మూత్‌గా కాసేపు మసాజ్ చేసుకోవాలి.అనంతరం ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి వాష్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే కాలిన గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.
అలాగే ఉల్లిపాయతోనూ కాలిన మచ్చలను నివారించుకోవచ్చు.
పీల్ తీసిన ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.ఈ ఉల్లి రసంతో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి మచ్చలకు పూయాలి.
ఆ తర్వాత పావు గంట పాటు ఆరనిచ్చి.ఇప్పుడు కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే మచ్చలు మటుమాయం అవుతాయి.
ఇక రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక స్పూన్ నిమ్మ రసం యాడ్ చేసుకుని మిక్స్‌లో చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మచ్చలపై అప్లై చేసి ఐదారు నిమిషాల పాటు సర్కిలర్ మోషన్‌లో మసాజ్ చేయాలి.రాత్రి నిద్రించే ముందు ఇలా చేసి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజూ చేసినా మంచి ఫలితం ఉంటుంది.