మెహం చూసి చెప్పే జాతకంలో నిజమెంత ఉంది? అది ఎలా సాధ్యం అవుతుంది?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం అనేక రకాల జ్యోతిష్యాలు ఉన్నాయి.మొహం చూసి, చేయి చూసి, గవ్వలు వేసి, కార్డులు తీసి… ఇలా ఒక్కటేమిటి అనేక రకాలుగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులుb మనకు జ్యోతిష్యం చెప్తుంటారు.

 Is It Really Possible Facial Astrology Is Done-TeluguStop.com

అయితే మొహం చూసి చెప్పో జ్యోతిష్యాన్నే ఇంగ్లీషులో పేస్ రీడింగ్ అంటారు.దీనినే ‘భావసాముద్రికం’ అని కూడా వ్యవహరిస్తారు.

ఈ జ్యోతిష్యం చెప్పే వారికి మనో జ్ఞానం సిక్త్స్ సెన్స్ ఉంటుంది.ఒక వ్యక్తి ముఖ కవళికలను, కంటి చూపులోని శక్తినీ, మాట్లాడే పద్ధతిని, ఒక వ్యక్తి ముఖ కవళికలను, వస్త్ర ధారణనూ, పలు వరుసనూ, పెదాలనూ, కను బొమ్మలనూ, భూజాల తీరునూ, నిలుచునే పద్ధతినీ, కూర్చునే పద్ధతినీ ముందుగా ఒక ఆంచనా వేస్తారు.నవ్వే విధానం కూడా పరిశీలిస్తారు.మెడ పొడుగును చూపులతోనే కొలుస్తారు.

ఆ తర్వాత కొద్ది సమయం ఆలోచించుకొని మన జీవితం గురించి చెప్పటం మొదలు పెడతారు.మనలోని లోపాలను మనలోని విశేషాలను పుస్తకం చదివినట్లుగా చదివేస్తారు.

దాదాపుగా ఎనభై శాతం నిజమే చెబుతారట.అయితే అన్ని జ్యోతిష్యాల్లాగే ఇది కూడా.

కాకపోతే ఈ ఫేస్ రీడింగ్ గురించి చెప్పే వారికి తొందరపాటు వుండకూడదు.అయితే బాబాలు, స్వాములు, గురువులు పై విధంగానే చెబుతుంటారు.

ఎదుటి మనిషిని అర్థం చేసుకోగల్గే శక్తి, మాటకారితనం ఉంటే చాలు మొహం చూసి సులువుగా జాతకం చెప్పేయొచ్చట.కానీ దీన్ని సామాన్య మానవులు చెప్పలేరు.

అంటే దీనిపై కచ్చితంగా అవగాహన ఉన్న వారు మాత్రమే జ్యోతిష్యం చెప్తారన్నమాట.అందుకే కేవలం కొందరు మాత్రమే ఈ జాతకాలు చెప్తుంటారు.

అబద్ధం చెప్పే వారు కూడా మనకు అక్కడక్కడా కనిపించవచ్చు.అయితే వారికి ఉన్న వాక్ చాతుర్యంతోనే మనల్ని మోసం చేయగల్గుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube