సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నాణ్యత లేని కుళ్ళిపోయిన పండ్లును పంపిణీ చేస్తూ,ఇదేంటని అడిగిన విద్యార్ధి నేతల పట్ల అసభ్యంగా మాట్లాడతున్న అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కొణితం శ్రీనివాస్ రెడ్డి లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పి.డి.
ఎస్.యు ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా పి.డి.ఎస్.యు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోలేబోయిన కిరణ్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ ని నాణ్యమైన పండ్లను పంపిణి చేయమని మాట్లాడితే మేము అధికార పార్టీ నాయకుడిని మమ్మల్ని మీరు ఏమి చేయలేరు, మీకు దమ్ముంటే మంత్రి, దగ్గర,కలెక్టర్ దగ్గర ధర్నా చేసుకోమని దురుసుగా మాట్లాడుతూ నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటూ అసభ్యంగా ప్రవర్తించిన కొణితం శ్రీనివాస్ రెడ్డి లెస్సేన్ రద్దు చేయాలని అన్నారు.
విద్యార్థులకు ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటే జిల్లాలో ఉన్న కొంతమంది అధికార పార్టీ నాయకులను దగ్గర చేసుకొని కాంట్రాక్టర్ గా కొనసాగుతూ,పేద,బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన పండ్లలను పంపిణి చేయకుండా కక్కుర్తి పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.పిల్లల నోటి కాడి తిండిని దోచుకుంటున్న అధికార పార్టీ కాంట్రాక్టర్ల లైసెన్సు రద్దు చేయకపోతే పేద బడుగు బలహీన విద్యార్థులకు నాణ్యమైన ఆహారము అందదని అన్నారు.
తక్షణమే జిల్లా మంత్రి,కలెక్టర్,ఆర్.సి.వో, డిసివో చొరవ తీసుకొని కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని అన్నారు.లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెప్పడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో పి.డి.ఎస్.యు డివిజన్ అధ్యక్షులు జలగం సుమంత్,డివిజన్ నాయకులు చిత్తలూరి గోపి,వేణు,నవీన్ తదితరులు పాల్గొన్నారు.