మూసీ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి.-సూర్యాపేట ఇరిగేషన్ డివిజన్ నెం.1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.బధ్రు
సూర్యాపేట జిల్లా:మూసీ ప్రాజెక్టుకు అప్‌స్ట్రీమ్ నుండి నిరంతర ఇన్‌ఫ్లోలు వస్తున్నందున,ప్రస్తుతం ప్రాజెక్ట్ దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది.ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది.
అందుకే,సూర్యాపేట మండలం రత్నాపురం, రామవరం,టేకుమట్ల తదితర గ్రామాలు,పెన్‌పహాడ్ మండలం అనాజీపురం,అనంతారం,దోసపహాడ్ తదితర గ్రామాలు,నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల,దాచారం,గంగపాలెం తదితర గ్రామాలు, కేతేపల్లి మండలం కాసనగూడేపల్లి చీకటిగూడెం, కొత్తపేట,భీమారం మొదలైన గ్రామాలు,వేములపల్లి మండలం ఆమనగల్లు,లక్ష్మీదేవిగూడెం,రావులపెంట తదితర గ్రామాలు,మాడుగులపల్లి మండలం తడ్కమల్ల,నర్సింహులగూడ,తక్కెళ్లపహాడ్ తదితర గ్రామాలను మూసీ నది వెంబడి ఉన్న గ్రామస్తులను అప్రమత్తం చేయండి.మానవులు అటు వెళ్ళకండి, పశువులు వెళ్ళనీయకండని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.బధ్రు తెలిపారు.