యాదాద్రి భువనగిరి జిల్లా:పార్టీ మారిన వారికి ప్రశ్నించే నైతిక హక్కు లేదని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అన్నారు.తనపై కొందరు కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై అయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధిలో ఎక్కడ కూడా రాజీ పడలేదని,కరోనా కష్ట కాలంలో సైతం అనేక సవాలను ఎదుర్కొని అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
అభివృద్ధి జరగలేదంటూ అవిశ్వాసం ప్రవేశ పెట్టడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని, అవిశ్వాసంకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్లతో పార్టీ అధిష్టానం మాట్లాడుతుందన్నారు.రూ.8 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు మున్సిపాలిటీలో కొనసాగుతున్నాయని,సిఎస్ఆర్ నిధులు రూ.1.30కోట్లతో నాగులకుంట సుందరీకరణ పనులు జరుగుతున్నాయని అన్నారు.చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని,పరిపాలన అంటే డబ్బులు మూట కట్టడం కాదని,ఎప్పటి నిధులు అప్పడు ఖర్చు చేస్తుండాలి చెప్పారు.