సూర్యాపేట జిల్లా:ఏప్రిల్ 18న జిల్లా కేంద్రంలో జరిగిన భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాలుగో జిల్లా మహాసభల్లో సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన అక్కినపల్లి వినయ్ ఎన్నికయ్యారు.వినయ్ ఇంతకు ముందు జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈమహాసభల్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ పాల్గొన్నారు.







