సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దేశ్ ముఖ్ రాధిక,వైస్ చైర్మన్ గా ఆదూరి స్రవంతి,డైరెక్టర్లు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, కాంగ్రెస్ నాయకులు దేశ్ ముఖ్ అరుణ్ కుమార్, ఆదూరి కిషోర్ రెడ్డి,అజీజ్ పాషా,మజీద్ మేస్త్రి సమ్మెట సుబ్బరాజు,జక్కుల మల్లయ్య,షేక్ మన్సూర్ అలీ,గంజి శివ తదితరులు పాల్గొన్నారు.







