సూర్యాపేట జిల్లా:పూజ గదిలో దీపం వెలిగించి ఇరుముడి మహోత్సవంలో కుటుంబ సభ్యులు నిమగ్నం కావడంతో దీపం ఇంటికి అంటుకొని ఇల్లు మొత్తం దగ్ధమైన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగులోకి వచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…కోదాడ పట్టణంలోని సాయినగర్ లో నివాసముంటున్న తొగరు సైదయ్య శ్రీరామ్ చిట్ ఫండ్స్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
సైదయ్య మాల ధరించడంతో ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి,!పూజ గదిలో దీపం వెలిగించి సూర్యాపేట అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమానికి వెళ్ళగా పూజాగదిలో దీపం అంటుకొని మంటలు చెలరేగాయి.చుట్టుపక్కల వారు గమనించి 104 ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇంటిలో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిద అవ్వడంతో సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.