1.నేడు కేసీఆర్ కీలక సమావేశం

మునుగోడు అసెంబ్లీ ఒక ఎన్నికల నేపథ్యంలో ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ లో కీలకంగా ఉంటూ టికెట్ ఆశిస్తున్న నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
2.మంత్రిని అడ్డుకున్న టిఆర్ఎస్ నేతలు
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా టిఆర్ఎస్ చెందిన దళిత నేతలు మంత్రి ని అడ్డుకున్నారు.
3.నాగార్జునసాగర్ ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్టులోని 10 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
4.జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నం
జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నించారు.ఈ ముట్టడిని అడ్డుకోవడంతో, లిబర్టీ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.
5.ఎల్లంపల్లి ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరదనీరు వచ్చి చేరుతుంది.దీంతో 25 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
6.మధ్యాహ్న భోజనానికి నిధులు విడుదల
తెలంగాణ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం పథకానికి 251 కోట్ల ను విడుదల చేసారు.
7.కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్న ఈడి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దూకుడు పెంచారు.ఈ మేరకు హైదరాబాదులోని జోనా ట్రావెల్స్ లో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
8.సర్టిఫికెట్ల అప్లోడ్ కు మరో అవకాశం
సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను , నిర్ణీత ఫార్మేట్ లో అప్లోడ్ చేసుకునేందుకు ఈనెల 21 నుంచి 27 వరకు ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులో ఉంచినట్లు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది.
9.ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు.
10.నేడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.
11.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే .500 కే వంట గ్యాస్

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.
12.తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1633 అడుగులుగా ఉంది.
13.23 నుంచి డిగ్రీ వెబ్ ఆప్షన్ లు

ఈనెల 23 నుంచి డిగ్రీ వెబ్ ఆప్షన్ లకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
14.చంద్రబాబుపై రోజా కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబుకు దేనిపైన పోరాటం చేయాలో తెలియడం లేదని మంత్రి రోజా విమర్శించారు.
15.విజయవాడలో బెస్తలు ధర్నా
విజయవాడ ధర్నా చౌక్ లో బెస్త కులస్తులు ధర్నాకు దిగారు.చట్టసభల్లో 30% రిజర్వేషన్ తమకు కల్పించాలని కోరుతూ ధర్నా కు దిగారు.
16.బండి సంజయ్ ని కలిసిన మత్య కారులు
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మౌలాలి లోని మనీషా గార్డెన్స్ లో తెలంగాణలోని మత్స్యకార ప్రతినిధులు కలిసారు.జీవో నెంబర్ 6 రద్దు చేయాలని వినతి పత్రం అందించారు.
17.కృష్ణంరాజు భార్యకు విజయమ్మ పరామర్శ

మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు కృష్ణంరాజు భార్యను వైఎస్ విజయమ్మ పరామర్శించారు.కృష్ణంరాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు.
18.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.బతుకమ్మ సంబరాలు

తెలంగాణలో ఈరోజు నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి.ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు బతుకమ్మ పండుగ నిర్వహించనున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,950 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,130
.