1.ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ లేదు : కేసీఆర్
తెలంగాణ ఏ రాష్ట్రంలోనూ 24 గంటలు కరెంట్ అందడం లేదని, బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
2.బి ఆర్ ఎస్ ఎంపీ పై కత్తితో దాడి
టిఆర్ఎస్ ఎంపీ ఆ పార్టీ దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి లో ఈ ఘటన జరిగింది.
3.రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన వారిని ఏపీ సీఎం జగన్ పరామర్శించారు.
4.చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది .ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.
5.రైలు ప్రమాదం మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఏపీ ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
6.కోదండరాం తో రేవంత్ రెడ్డి భేటీ
టీజేఎఫ్ చీఫ్ కోదండరాం తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
7.విష్ణువర్ధన్ రెడ్డి నివాసం కి వెళ్ళిన హరీష్ రావు
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి తెలంగాణ మంత్రి హరీష్ రావు వెళ్లారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ లో చేరాలని విష్ణువర్ధన్ రెడ్డిని హరీష్ రావు ఆహ్వానించారు.
8.రైలు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం
విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరమని, బాధితులకు టిడిపి అండగా ఉంటుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.
9.ఆర్టిసి బస్సు డ్రైవర్ పై దాడిని ఖండిస్తున్నాం
కావలిలో ఆర్టిసి బస్సు డ్రైవర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని , దాడి చేసిన నిందితులలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారని, ప్రధాన నిందితుడిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు.
10.టిడిపి జనసేన సమన్వయ కమిటీ సమావేశం
టిడిపి జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశానికి రెండు పార్టీలకు చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు హాజరయ్యారు.
11.ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే బీసీలకు అన్యాయం చేసే ముస్లిం రిజర్వేషన్లను మొదటి క్యాబినెట్ లోనే రద్దు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
12.ఇసుక టెండర్ల బిట్ దాఖలకు 6 వరకు గడువు
ఇసుక టెండర్లలో కాంట్రాక్ట్ సంస్థలు బిడ్ దాఖలు చేసే గడువును తొలగిస్తూ గనుల శాఖ నిర్ణయం తీసుకుంది.వచ్చే నెల 6 వరకు గడువును పొడిగించింది.
13.విజయ్ సాయి రెడ్డి పై బిజెపి విమర్శలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుద్ధి లేకుండా సంస్కారహీనంగా మాట్లాడడం సిగ్గుచేటని బిజెపి నేతలు భాను ప్రకాష్ రెడ్డి , షేక్ బాజీ మండిపడ్డారు.మద్యం తయారీ విధానం పై ఏపీ ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి విమర్శలు చేసిన క్రమంలో విజయ్ సాయి రెడ్డి స్పందించిన తీర్పు బిజెపి నేతలు మండిపడుతున్నారు.
14.ఏపీటీఎఫ్ ధర్నా
ఉద్యోగ , ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్ తో రాష్ట్రస్థాయిలో నవంబర్ 15న విజయవాడలో ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీ టీచర్స్ ఫెడరేషన్ 257 అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు.
15.కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి గవర్నర్ ఆగ్రహం
సిద్దిపేటలో బి ఆర్ ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన కత్తి దాడిని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఖండించారు .ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు , ప్రచారకుల భద్రతపై సరైన చర్యలు తీసుకోవాలని డిజిపి కి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.
16.కెసిఆర్ లక్ష కోట్లు సంపాదించారు
పదేళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ దాదాపు లక్ష కోట్ల ఆస్తులను సంపాదించారని ఖమ్మం మాజీ ఎంపీ , పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
17.కార్తీక బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బ్రోచర్లను టిటిడి చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు.
18.ఈటెల రాజేందర్ కామెంట్స్
కెసిఆర్ కు బుద్ధి చెప్పేందుకే గజ్వేల్ లోను పోటీ చేస్తున్నట్లు హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
19.ఏపీలో రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ ఆగ్రహం
ఏపీలోని విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. నిద్రపోతున్న రైల్వే శాఖ ఎప్పుడు మేల్కొంటుంది అని ఆమె విమర్శించారు.
20.పశువులకు పిపిఆర్ టీకాల పంపిణీ ప్రారంభం
గొర్రెలు మేకలలో పి పి ఆర్ వ్యాధితో కలిగే మరణాలను తగ్గించడం కోసం పశుసంవర్ధక శాఖ పిపిఆర్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తోంది.ఈ విషయాన్ని పశుసంవర్ధక శాఖ తెలిపింది.