లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో విజయ్( Vijay ) హీరోగా ఇటీవల దసరాకు వచ్చిన లియో సినిమా తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా మిగిలిన ప్లేస్ లలో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది.ఇక ఈ సినిమా విజయ అభిమానులను ఎంతో సంతోషపరిచినప్పటికీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులను మాత్రం కాస్త నిరాశపరిచిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పలు ప్రాంతాలలో మిశ్రమ స్పందన లభించుకున్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ అలాగే పండుగ నేపథ్యంలో భారీగానే కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది.

విజయ్ లియో( Leo ) సినిమా మొదటి రోజే 140 కోట్లకు పైగా గ్రాస్, వారం రోజుల్లోనే 461 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసిందని చిత్రయూనిట్ ప్రకటించారు.అయితే ఈ సినిమా కలెక్షన్స్ అన్ని ఫేక్ అంటూ తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం, పలువురు థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తమిళనాడులో ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదని ఈ సినిమా కలెక్షన్స్ గురించి దర్శక నిర్మాతలు చెబుతున్నవన్నీ కూడా అవాస్తవాలేనంటూ తెలిపారు.

ఇక ఈ విషయం గురించి తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి డైరెక్టర్ లోకేష్ కు మీడియా ప్రతినిధి నుంచి ప్రశ్న ఎదురైంది.ఈ సినిమాకు వస్తున్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఫేక్ అంటూ వార్తలు వస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా లోకేష్ సమాధానం చెబుతూ సినిమా కలెక్షన్ల గురించి నాకు ఏమాత్రం తెలియదు ఆ విషయం మా నిర్మాతలను అడగండి కానీ సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం ల్యాగ్ ఉందని అంటున్నారు ఆడియన్స్.దానిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అన్నారు.
దీంతో లోకేష్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.స్వయనా డైరెక్టర్ ఇలా మాట్లాడటంతో విజయ అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
.






