ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్‌లో ముందు రాజమౌళి( Rajamouli ) నిలుస్తాడు.ఇక మన టాలీవుడ్ కాకుండా దర్శక ధీరుడు ఎవరైనా ఉన్నారా అంటే ప్రశాంత్ నీల్( Prashanth Neil ) గుర్తుకొస్తాడు.
ఈ డైరెక్టర్ కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేశాడు.భారతదేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ ఒక్క మూవీ సిరీస్ తోనే ప్రశాంత్ నీల్ అద్భుతమైన టాలెంట్ బయటపడింది.వీరితో పాటు టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలుస్తున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా “జవాన్”( Jawan ) సినిమాని అట్లీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ రూ.300 కోట్లతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ.1,100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది.ఈ ఒక్క మూవీతో అట్లీ కుమార్ గ్లోబల్ లెవెల్ లో పాపులర్ అయ్యాడు.ఆ విధంగా అట్లీ కుమార్( Atlee Kumar ) ఒక్కసారిగా రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి గొప్ప డైరెక్టర్లకు పోటీగా నిలిచాడు.అయితే రెమ్యునరేషన్ విషయంలో వీరిద్దరినీ అట్లీ కుమార్ దాటేసినట్లు సినిమా వర్గాలతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఇండియన్ సినిమా హిస్టరీలో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న మొదటి డైరెక్టర్‌గా రాజమౌళి రికార్డ్ సృష్టించాడు.అయితే రీసెంట్‌గా ఆ అరుదైన రికార్డును డైరెక్టర్ అట్లీ తిరగరాసాడని అంటున్నారు.అట్లీ కుమార్ జవాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక మొత్తంగా రూ.200 కోట్లు రెమ్యునరేషన్ గా పొందినట్లు వార్తలు వస్తున్నాయి.అదే నిజమైతే ఆ రికార్డును రాజమౌళి కాదు కదా! ప్రశాంత్ నీల్ కూడా ఇప్పట్లో టచ్ చేసే అవకాశం ఉండదు.
హీరోలు కూడా పారితోషికం విషయంలో అట్లీ కుమార్ ను దాటేసే చాన్సే లేదు.ఐదారు సంవత్సరాల వరకు అట్లీ క్రియేట్ చేసిన రికార్డు అలాగే ఉంటుందని కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు.అయితే ఇదే సమయంలో పారితోషికానికి సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తోంది.అదేంటంటే మూవీ కలెక్షన్స్ రూ.1,000 కోట్లు దాటిన తర్వాత నిర్మాతలను కలిసి తనకు రూ.200 కోట్లు ఇవ్వమని అట్లీ కోరాడట.తన వల్లే ఇన్ని కోట్లు వచ్చాయని, తన ప్రతిభను గుర్తించి మొత్తం రూ.200 కోట్లు సెటిల్ చేయాలని అడిగాడట.అయితే మేకర్స్ చర్చించుకుని అలాగే ఇచ్చేటట్లు ఒప్పుకున్నారని అంటున్నారు.ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అట్లీ పారితోషికమే హాట్ టాపిక్ గా మారింది.