హెల్మెట్ పై అవగాహన ర్యాలీ

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలో మంగళవారం సీఐ ఆదర్యంలో మోటర్ సైకిల్ వాహనదారులకు హెల్మెట్ ధరించుట మరియు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని,ప్రమాదం సంభవించినప్పుడు తలకు హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం ఉండదని,మన ప్రాణాలు మనకంటే మనపై ఆధారపడి,మనకోసం ఎదురుచూస్తున్న మన కుటుంబ సభ్యులకు చాలా ముఖ్యమని తెలిపారు.

 Awareness Rally On Helmets-TeluguStop.com

డ్రైవింగ్ లైసెన్స్,ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని,మైనర్లకు మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి ఎట్టి పరిస్థితిలో వాహనాలు ఇవ్వవొద్దని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపవద్దని,ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని సూచించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లయితే వాహనం సీజ్ చేయటం మరియు రైడర్ ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు.

ప్రతిఒక్క వాహనదారుడు తమ తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ ఆఫర్ పీరియడ్ లో క్లియర్ చేసుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎస్ఐ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube