చచ్చే వరకు సొంత ఇల్లు లేని దళిత కుటుంబం

నల్లగొండ జిల్లా:దళిత కుటుంబంలో పుట్టిన పాపానికి చచ్చే వరకు సొంత గూడు లేకుండా బ్రతకాల్సి రావడం,చివరికి శవాన్ని కూడా ఉంచడానికి ఇల్లు లేక ఖాళీ ప్రదేశంలో టెంట్ వేసి ఉంచడం అంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకావాలి,ఏలే పాలకులు సిగ్గు పడే హృదయ విధారక విషాద ఘటన బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో జరిగింది.స్థానిక జంగాల కాలనీకి చెందిన కొప్పెర కోటయ్య (50) జీవనోపాధికై కల్వకుర్తికి వలసపోయి ఎక్కడపడితే అక్కడ డేరాలు కట్టుకొని నివాసం ఉండేవారు.

 A Dalit Family Without Own House Till Death, Munugodu Mandal , Dalit Family ,  O-TeluguStop.com

అతనికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు.

మునుగోడులోఅతనికి సొంత ఇల్లు లేక పోవడంతో ఎప్పుడూ సంచార జీవనం సాగిస్తున్నాడు.

కోటయ్య హార్ట్ ఎటాక్ తో మరణించడంతో మృతదేహాన్ని స్వగ్రామంమునుగోడుకు తీసుకొచ్చారు.ఇక్కడ మృతదేహాన్ని ఉంచడానికి ఇల్లు లేని కారణంగా ఖాళీ జాగాలో టెంటు వేసి అక్కడ ఉంచారు.

ఈ సందర్భంగా కోటయ్య భార్య,కుమారులు వచ్చిన వారిని చూసి మాకు ఇల్లు లేదు సారూ…ప్రభుత్వమే మమ్ముల్ని ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవడం పలువురిని కంటతడి పెట్టించింది.ఈ కాలనీలో దాదాపు ఇదే పరిస్థితి…!ఇక్కడ 30 ఏళ్ల నుండి జంగాల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

చాలా మందికి ఇల్లు ఉండదు,కనీసం స్నానాలు చేయడానికి బాత్ రూమ్స్ఉండవు.మహిళలు పట్టాలు కట్టుకొని అనేక ఇబ్బందులు పడుతున్నారు.

కనీసం ఇప్పటివరకు మురికి కాలువలు,సీసీ రోడ్లు నిర్మించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.దళితజాతిపై ప్రభుత్వం చూపుతున్న వివక్షతకు నిదర్శనం బీఎస్పీ మండల నాయకుడు సూరన్న దళితులను ఓట్లు అడిగేటప్పుడు లేని వివక్షత,వారికి సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు చూపిస్తున్నారని బీఎస్పీ మునుగోడు మండల నాయకులు సూరన్న ప్రశ్నించారు.

ప్రభుత్వం వీరిపై వివక్షత చూపడం సబబు కాదన్నారు.తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి మరణించిన ఇల్లు లేని కోటయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని,ఆ కాలనీని సందర్శించి వారికి కనీస సౌకర్యాలు కోసం చర్యలు తీసుకోవాలని,అర్హులను గుర్తించి వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube