లోకేష్ పాదయాత్ర పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుండి పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Former Minister Ganta Srinivasa Rao Sensational Comments On Lokesh Padayatra Det-TeluguStop.com

నేడు ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ ప్రారంభిస్తున్న “యువగళ్ళం” పాదయాత్ర గురించి ప్రస్తావిస్తూ.పాదయాత్ర ఈనెల 27 నుండి ప్రారంభమవుతుంది.400 రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర జరగనుంది.

నారా లోకేష్ పాదయాత్రకి సంబంధించి మొత్తం 175 నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కచ్చితంగా లోకేష్ “యువగళ్ళం” పాదయాత్ర విజయవంతం అవుతుందని గంటా తెలిపారు.రాష్ట్రంలో యువత అనేక ఇబ్బందులు పడుతోంది.

కచ్చితంగా లోకేష్ ని యువత ఆదరిస్తారు అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రతో సహా పలు కీలక నియోజకవర్గలలో లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లు మొత్తం గంటనే చూసుకుంటున్నట్లు సమాచారం. గతంలో గంటా తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు రకరకాల ప్రచారాలు జరిగాయి.అయితే తాజాగా లోకేష్ పాదయాత్ర పై పాజిటివ్ గా గంటా కామెంట్లు చేయడంతో… పార్టీ మార్పుకు సంబంధించి వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube