ఒకప్పుడు సంగీతం అంటే నార్త్ పాటలను అనుసరించడం, లేదా అనుకరించడం.ఇలాంటి పరిస్థితిలో తనదైన కొత్త శైలి లో ఎవరి ప్రభావం లేకుండా సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి సాలూరి రాజేశ్వర రావు.
నేటి యువతకు అయన పేరు కానీ అయన సంగీతం అందించిన సినిమాలు కానీ పెద్దగా తెలియకపోవచ్చు.కానీ అక్కినేని, ఎన్టీఆర్ కాలంలో టాలీవుడ్ చిత్ర సంగీత స్వరూప్యాన్ని మార్చిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు దక్కాయి.1935 లో శ్రీకృష్ణ లీలలు అనే చిత్రం ద్వారా తొలిసారి నటుడి గా పరిచయం అయ్యి జయప్రద అనే సినిమా ద్వారా సంగీత దర్శకత్వం చేపట్టిన సాలూరి 1986 వరకు స్వరాలు సమకూరుస్తూనే ఉన్నారు. కృష్ణం రాజు నటించిన తాండ్ర పాపారాయుడు అయన చివరి సినిమా.
ఏకంగా యాభై ఏళ్ళ పాటు అనేక సినిమాల తో అయన ప్రయాణం అసమానమైనది.ఇల్లాలు సినిమాలో అయన పాటలు అప్పట్లో తెలుగులో మాత్రమే కాకుండా యావత్ సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని సాధించాయి.ఇక మనుషులంతా ఒక్కటే, పూలరంగడు, మల్లీశ్వరి, మిస్సమ్మ, కురుక్షేత్రం, ఆరాధన, రంగుల రాట్నం, ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాలకు అందించిన సాలూరి కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు.అయన తమిళ సినిమాలతో పాటు కన్నడ సినిమాలకు కూడా స్వరాలు అందించారు.
ఇక తాండ్రపాపారాయుడు పాటల రికార్డింగ్ తర్వాత మళ్లి ఏ సినిమాలోనూ అయన నటించలేదు.
ఇక సాలూరి ఒక రోజు తీవ్రంగా ఎక్కిళ్ళు రావడం మొదలయ్యింది.దగ్గర్లో ఉన్న డాక్టర్ ని రప్పించి చికిత్స అందించగా ఎక్కిళ్ళు అగ్గిపోయాయాయి.కానీ అంతలోనే ఆయనకు పెరలాసిస్ రావడం తో శరీరం లో కొన్ని భాగాలు పని చేయడం మానేశాయి.
ఆలా ఏడేళ్ల పాటు మంచానికే పరిమితం అయినా సాలూరి కొన్నాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆ తర్వాత ఇంట్లోనే చివరి శ్వాస వరకు ఉన్నారు.మంచం పైననే ఉంటూ తన మనవాళ్లతో ఆదుకునే వారు.
తన సంతానం సాలూరిని పసి పిల్లాడిలా చూసుకునేవారు.ఇక 1999 అక్టోబర్ 25న తన సమ్మోహన స్వరాలతో మనలని సుసంపన్నం చేసిన సాలూరి తుది శ్వాస విడిచారు.
ఇక అయన ఐదుగురు కుమారుల్లో వాసు రావు, కోటి సైతం సంగీత దర్శకులుగా అయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.