వయసు పై పడటం, ప్రెగ్నెన్సీ, బరువు తగ్గడం లేదా పెరగడం, ధూమపానం, మద్యపానం, నిద్రను నిర్లక్ష్యం చేయడం తదితర కారణాల వల్ల చర్మం లో ఉండే కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయి.దాంతో చర్మం సాగిపోతూ ఉంటుంది.
ఇలా చర్మం సాగడం వల్ల ముసలి వారీగా కనిపిస్తారు.చర్మ సౌందర్యం సైతం తీవ్రంగా దెబ్బ తింటుంది.
ఈ నేపథ్యంలోనే సాగిన చర్మాన్ని బిగుతుగా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే కనుక సాగిన చర్మాన్ని టైట్‌గా మరియు బ్రైట్ గా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్లండర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్ ను వేసుకోవాలి.ఆ తర్వాత అందులో సపరేట్ చేసి పెట్టుకున్న అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, ఆఫ్ టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని.ఏదైనా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే సాగిన చర్మం మళ్లీ టైట్‌గా మారుతుంది.
పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ గ్లోయింగ్‌గా మరియు షైనీగా మెరుస్తుంది.డ్రై స్కిన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.అదే సమయంలో చర్మం స్మూత్ అండ్ సాఫ్ట్‌గా సైతం మారుతుంది.