Stubborn Spots : ఈ సింపుల్ రెమెడీతో చెంపలపై ఉండే మొండి మచ్చలకు పర్మినెంట్ గా గుడ్ బై చెప్పవచ్చు.. తెలుసా?

మొటిమలు, వయసు పైబడటం, పిగ్మెంటేషన్ తదితర కారణాల వల్ల కొందరికి చెంపలపై ముదురు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.ఈ మచ్చలు ఓ పట్టాన అస్సలు పోవు.

 Follow This Simple Remedy To Get Rid Of Stubborn Spots On Cheeks Permanently He-TeluguStop.com

వాటిని వదిలించుకోవడం కోసం ఖరీదైన క్రీములు, సీరం లను వాడుతుంటారు.అయితే కెమికల్స్ తో నిండి ఉండే ఇటువంటి ఉత్పత్తుల వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీ చెంపలపై ఏర్పడిన మొండి మచ్చలు సమర్థవంతంగా నివారిస్తుంది.ఈ రెమెడీతో పర్మినెంట్ గా మచ్చలకు( Stubborn spots ) గుడ్ బై చెప్పవచ్చు.

మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Cheeks, Clear Skin, Skin, Latest, Simple Remedy, Skin Care, Skin Ca

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange peel powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green tea powder ) వేసుకొని మిక్స్ చేసుకోవాలి.ఆపై అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా పాలు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చెంపలపై మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకోవాలి.

Telugu Tips, Cheeks, Clear Skin, Skin, Latest, Simple Remedy, Skin Care, Skin Ca

20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు.ఈ రెమెడీ చెంపలపై ఏర్పడిన ముదురు రంగు మచ్చలను కొద్దిరోజుల్లోనే పూర్తిగా మాయం చేస్తుంది.

స్కిన్ టోన్ ను ఈవెన్ గా మారుస్తుంది.ఆరెంజ్ పీల్ పౌడర్, కాఫీ పౌడర్, గ్రీన్ టీ పౌడర్ మరియు ముల్తానీ మట్టిలో ఉండే పలు సుగుణాలు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి చర్మ సమస్యలకు చెక్ పడతాయి.చర్మాన్ని అందంగా కాంతివంతంగా మెరిపిస్తాయి.

ఈ రెమెడీ ద్వారా మీ స్కిన్ షైనీగా మారుతుంది.మేకప్ లేకపోయినా కూడా అందంగా మెరిసిపోతారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube