శ్రీదేవి తన చెల్లెలి కోసం క్యారేజ్ పట్టుకుని వచ్చేవారట.. అసలేమైందంటే?

అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తమిళనాడులో జన్మించిన శ్రీదేవి తెలుగులోనే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్నారు.

 Interesting Facts About Senior Star Heroine Sridevi , Interesting Facts, Netizen-TeluguStop.com

తెలుగుతో పాటు ఇతర భాషల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు శ్రీదేవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు.సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి కూతురు శైలజా రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

శైలాజా రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్ తో అమ్మ లంచ్ పంపించేదని మ్యాట్, క్యారియర్, ప్లేట్, స్పూన్స్ అన్నీ పంపించేవారని స్కూల్ లో తనతో పాటు మరికొందరు సినిమా ఆర్టిస్టుల పిల్లలు కూడా ఉండేవారని తెలిపారు.కేఆర్ విజయ కూతురుతో పాటు శ్రీదేవి చెల్లలు కూడా తమ స్కూల్ లోనే చదువుకున్నారని శ్రీదేవి తన చెల్లి కోసం క్యారేజ్ పట్టుకుని వచ్చేవారని ఆమె అన్నారు.

ఆ సమయంలో శ్రీదేవి వయస్సు 7 సంవత్సరాలు అని ఆ వయస్సుకే చెల్లి కోసం లంచ్ తీసుకొచ్చేవారని శైలాజా రెడ్డి తెలిపారు.తులసి, విజయశాంతి, రమ్యకృష్ణ మా స్కూల్ లోనే చదువుకున్నారని ఆమె అన్నారు.

మాకు ప్రత్యేకంగా భోజనం రావడం నచ్చేది కాదని శైలజా రెడ్డి పేర్కొన్నారు.అందరిలాగా తాను కూడా లంచ్ బాక్స్ తెచ్చుకుంటే బాగుంటేదని అనిపించేదని ఆమె పేర్కొన్నారు.

నాన్న పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండేవారని రాజీవ్ గాంధీ గారితో నాన్న చాలా క్లోజ్ అని శైలజా రెడ్డి వెల్లడించారు.నాన్న హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారని అందువల్ల పెద్దవాళ్లతో మాట్లాడే అవకాశం దక్కిందని శైలజా రెడ్డి అన్నారు.నాన్న తన పరిచయాలను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకోలేదని సినిమాలకు సెన్సార్ సమస్యలు వస్తే ఆ సమస్యలను నాన్న పరిష్కరించారని శైలాజా రెడ్డి పేర్కొన్నారు.శైలజా రెడ్డి శ్రీదేవి గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube