Raja Movie : రాజా మూవీ కి పాతికేళ్ళు..రీరిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులు

హీరో వెంకటేష్ ( Venkatesh )తీస్తున్న సినిమాలన్నీ విజయవంతం అవుతుండడం వల్ల ఆయన పేరు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోవడం తో పాటు ఆయన పేరుకు విక్టరీ అని ఇంటి పేరుగా మారిపోయింది.అయితే ఆయన నటించిన రాజా సినిమా( Raja movie ) ఎంతో ప్రత్యేకమైన సినిమా.

 Fans Are Waiting For Raja Movie Rerelease-TeluguStop.com

ప్రస్తుతం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి మరోసారి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.ఎందుకంటే వెంకటేష్ ఇప్పటి వరకు చాలా సినిమాల తీశాడు.

అందులో రిపీట్ చేయగలిగినటువంటి వాల్యూ ఉన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి.అలా రిలీజ్ చేయాల్సివస్తే ముందు వరుసలో ఉండే అద్భుతమైన ఆణిముత్యం లాంటి సినిమా ‘ రాజా ‘.

ఈ సినిమా ఎప్పుడు రీరిలీజ్ అవుతుందా అని వెంకటేష్ ఫాన్స్ అంతా కూడా 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Telugu Fans Raja, Raja, Rajakumar, Soundharya, Tollywood, Venkatesh-Telugu Top P

మొదట చిన్న తంబి పేరుతో ఈ సినిమా తమిళంలో వచ్చింది.అక్కడ సినిమా విడుదలై హిట్ అయినా తర్వాత ఖచ్చితంగా దాన్ని తెలుగులో రీమేక్ చేస్తే అద్భుతంగా ఉంటుంది అని అనుకుని రాజా పేరు తో రీమేక్ చేశారు.ఇక ఈ సినిమా విజయం సాధించడంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎస్.

ఏ.రాజకుమార్( S.A.Rajakumar ) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎందుకంటే ఈ సినిమా విజయం సాధించి సాధించింది అంటే దానికి పూర్తి కారణం ఆయనే.ఈ సినిమాకి కంటెంట్ ఎంత బాగుంటుందో సంగీతం అంతకన్నా వెయ్యిరెట్లు అద్భుతంగా ఉంటుంది.

అదే ప్రాణవాయువు కూడా.రాజా సినిమాలో వచ్చిన ప్రతి ఒక్క పాట ఒక క్లాసిక్.

అంతేకాదు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది.అందులో వచ్చే ఎన్నో బీట్స్ ఇప్పటికీ మనల్ని ఎక్కడో చోట తగులుతూనే ఉంటాయి వెంటాడుతూనే ఉంటాయి.

Telugu Fans Raja, Raja, Rajakumar, Soundharya, Tollywood, Venkatesh-Telugu Top P

90 ‘s కిడ్స్ కి ఈ సినిమా ఖచ్చితంగా ఒక స్పెషల్ చిత్రం.ఎందుకంటే అప్పట్లో వెంకటేష్ సౌందర్య( soundharya ) నిజమైన భార్య భర్తలు అనుకుని సినిమాకి వెళ్లేవారు జనాలంతా కూడా.అంతా అద్భుతంగా తెరపై కనిపిస్తుంటారు ఈ జంట.వారు తీసిన సినిమాలు దాదాపు అన్ని విజయం సాధించాయి.అప్పట్లో కమర్షియల్ సినిమాలు మాత్రమే బాగా వసూలు సాధిస్తున్న రోజులు అలాగే ఎక్కువగా వంద రోజులు నడుపుకుంటున్న సినిమాలు.ఆ టైంలో వచ్చిన రాజా ఒక క్లాసిక్ ఫ్యామిలీ చిత్రంగా వచ్చి 71 సెంటర్లో 100 రోజులు నడిచింది, అలాగే 175 రోజులు 4 సెంటర్లలో నడిచింది.

అప్పట్లో వెంకటేష్ కి లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగేలా చేయడంలో రాజా ముఖ్య పాత్ర పోషించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube