సూర్యాపేట జిల్లా: పోటీ పరీక్షల కోసం జిల్లా గ్రంధాలయానికి వచ్చే విద్యార్థి,యువతకు స్నాక్స్ తో పాటు సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు.మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్ర గ్రంధాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.పోటీ పరీక్షలకు సన్నద్దమౌతున్న యువతీ యువకులతో ఆయన మాట-మంతి సాగించారు.1980 నుండి 1985 వరకుగ్రంధాలయం లోని స్వీయ అనుభవాలు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడిస్తుంటే వారు శ్రద్ధగా ఆలకించారు.వేసవి తాపం నుండి రక్షణగా ఉండేలా కూలర్లు తదితర ఏర్పాట్లు చేయాలంటూ అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీచేశారు.ఆధునిక పరజ్ఞానంతో కూడిన గ్రంధాలయ భవనాన్ని నిర్మించనున్నట్లు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.
స్వయం ఉపాధిపై మహిళలు దృష్టి సారించాలని పిుపునిచ్చారు.
అందుకు అవసమైన ఓరియంటేశన్ శిక్షణకు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
విద్య ఉపాధి కోసమని,ఉద్యోగం కోసం కాకూడదని విద్యార్థి యువతకు హితవు పలికారు.ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడాలని,అదే సమయంలో ప్రభుత్వ ఉధ్యోగమే పరమావధి కాకూడదని వారికి ఉద్బోధించారు.
తాను గ్రంధాలయంలో ఉద్యోగం కోసం ఏనాడూ చదువలేదని,విజ్ఞానం కోసమే చదివినానని అన్నారు.పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతీ యువకులకు ఆల్ ది బెస్ట్ చెప్పి,వారికి కావాల్సిన సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మంత్రి వెంట గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు భరత్ మహాజన్,జహీర్,కుంభం రాజేందర్,మడిపల్లి విక్రమ్ తదితరులు ఉన్నారు.