ఎమ్మెల్యే భాస్కర్రావు క్షమాపణ చెప్పాలి

నల్లగొండ జిల్లా: కుల వృత్తులను చులక చేస్తూ అవమానకరంగా మాట్లాడిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ, రజక, బీసీ సంఘాల నేతలు రాయంచు నరసింహా, నాగభూషణం,పగిళ్ల కల్యాణ్,జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు.శుక్రవారం ఎమ్మెల్యే మాటలపై మిర్యాలగూడ ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంఘాల సమావేశంలో వారు మాట్లాడుతూ… బుధవారం దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,మీడియా సమక్షంలో ‘చాకలి’ ‘మంగలి’ పనులు నేనే చేయాలా అంటూ తమ వృత్తులను అవహేళన చేసేలా మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు.

 Mla Bhaskar Rao Should Apologize, Mla Bhaskar Rao , Nallamotu Bhaskar Rao, Mla B-TeluguStop.com

కులాల పేరిట కించపరిచే సంస్కృతిని కొనసాగించటం సరికాదన్నారు.ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి సామెతల రూపంలో వృత్తులను అగౌరపర్చటం ఏమిటని ప్రశ్నించారు.అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ…బీసీల కులవృత్తులను అవమానించటం ఏమిటని,మరోసారి ఈ తరహా చర్యలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఈ సమావేశంలో గానపాటి రవి,సతీష్,యాదగిరి, సైదులు,లక్ష్మణ్,వెంకన్న, విష్ణు, చిన్న సైదులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube