ఎమ్మెల్యే భాస్కర్రావు క్షమాపణ చెప్పాలి
TeluguStop.com
నల్లగొండ జిల్లా: కుల వృత్తులను చులక చేస్తూ అవమానకరంగా మాట్లాడిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ, రజక, బీసీ సంఘాల నేతలు రాయంచు నరసింహా, నాగభూషణం,పగిళ్ల కల్యాణ్,జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం ఎమ్మెల్యే మాటలపై మిర్యాలగూడ ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంఘాల సమావేశంలో వారు మాట్లాడుతూ.
బుధవారం దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,మీడియా సమక్షంలో ‘చాకలి’ 'మంగలి' పనులు నేనే చేయాలా అంటూ తమ వృత్తులను అవహేళన చేసేలా మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు.
కులాల పేరిట కించపరిచే సంస్కృతిని కొనసాగించటం సరికాదన్నారు.ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి సామెతల రూపంలో వృత్తులను అగౌరపర్చటం ఏమిటని ప్రశ్నించారు.
అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ.బీసీల కులవృత్తులను అవమానించటం ఏమిటని,మరోసారి ఈ తరహా చర్యలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో గానపాటి రవి,సతీష్,యాదగిరి, సైదులు,లక్ష్మణ్,వెంకన్న, విష్ణు, చిన్న సైదులు తదితరులు పాల్గొన్నారు.
కాశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు .. యూకే పార్లమెంట్‌లో తీర్మానం