అక్రమ వెంచర్లపై అదనపు కలెక్టర్ ఎదుట నిరసన...!

సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ మోహన్ రావును 23వ వార్డ్ కౌన్సిలర్ జక్కుల వీరయ్య,మూడో వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డిలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న అక్రమ లేఔట్లపై అదనపు కలెక్టర్ కి వివరించారు.

 Protest In Front Of Additional Collector Against Illegal Ventures, Protest , Add-TeluguStop.com

తక్షణమే అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.ఈ సమయంలో వచ్చిన మున్సిపాల్ కమిషనర్ ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.

దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు పట్నంలోని శ్రీ నగర్ కాలనీ, బైపాస్ రోడ్, కాచవారిగూడెం వెళ్ళే రహదారి పక్కనున్న వెంచర్ తోపాటు

మేళ్లచెరువు రోడ్ లోని శివ పార్వతి రియల్ ఎస్టేట్ వెంచర్ కి ప్రభుత్వ అనుమతులు లేవని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి వెంచర్ లో ఉన్న రోడ్లను జెసిబితో తొలగించారు.అనుమతులు లేని వెంచర్ లో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయొద్దని సూచించారు.

అనంతరం కౌన్సిలర్లు మాట్లడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి రావాల్సిన 10 శాతం లే అవుట్ స్థలం ఇవ్వకుండా ఇష్టానుసారంగా ప్లాట్లు విక్రయాలు చేస్తున్నారని అన్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సమయంలో 50 ఎకరాల స్థలాన్ని అనుమతులు లేకుండా వెంచర్లుగా చేసి మున్సిపాలిటీకి రావలసిన ఆదాయానికి గండి కొడుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు.

కొన్నాళ్లుగా మున్సిపల్ లేఔట్ స్థలాలు కబ్జా చేస్తున్నారన్నారు.మున్సిపాలిటీ కేంద్రంగా రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube