సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె బాట పట్టడంతో సర్కార్ బడుల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక అర్ధాకలితో అలమటిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ మునగాల మండల నాయడుడు శివ నాయక్ అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో భోజనం లేకపోవడంతో విద్యార్థులు ఇంటి నుండి బాక్సులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని,
దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సరైన సమయానికి ఇంటిదగ్గర భోజనం కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని,హాస్టల్ చదివే విద్యార్థుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం బడి పిల్లలను దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం భోజన కార్మికుల డిమాండ్లను పరిష్కరించి విధుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.