సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం ఎడవెల్లి గ్రామంలో టీకా వికటించి ఓ బాలుడు మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు ఆదివారం నూతనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఎడవెల్లి గ్రామానికి చెందిన కారింగుల నాగలక్ష్మి రాజు దంపతుల కుమారుడుకి 45 రోజులకు వేసే టీకాలు OPV-1,ROTA-1,PCV-1 IPV-1PENTA-1స్థానిక ఏఎన్ఎం ట్రైనింగ్ ఉండడం వలన పక్క ఊరి ఏఎన్ఎం ఇంచార్జిగా ఉండడంతో పక్క ఊరికెళ్ళి టీకా వేయించారు.
టీకా వేసిన తర్వాత ఇంటికి రాగానే బాబు కాలు కదపకుండా ఉండడం,రాత్రి పాలు పట్టక పోవడంతో ఏఎన్ఎం ఇచ్చిన సిరఫ్ లు పోశారు.ఆదివారం ఉదయం బాబు మృతి చెందడంతో టీకా వికటించే మృతి చెందాడని ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు నూతనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆందోళన చేపట్టారు.
బాలుడి మరణానికి కారణాలు తెలియడం కోసం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయమై సూర్యాపేట డీఎం అండ్ హెచ్ఓ డా.కోట చలం ను వివరణ కోరగా బేబీ పోస్టుమార్టం ఇంకా పూర్తి కాలేదని,పూర్తి అయిన తర్వాత నిజానిజాలు నిగ్గు తేలుతాయన్నారు.రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తామని అన్నారు.
ఇప్పటివరకు అయితే అలాంటి టీకాలు వందల మంది పిల్లలకు వేయడం జరిగిందని,ఎవరికి కూడా ఏమి కాలేదని,డాక్టర్ల నిర్లక్ష్యమని కూడా ఏమీ చెప్పలేమని అన్నారు.