సూర్యాపేటకు హైడ్రాకు సంబంధం లేదు:పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:జిల్లా హైడ్రాతరహా కూల్చివేతలు ఉంటాయని బీఆర్ఎస్ నాయకులు పట్టణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని,జిల్లా కేంద్రంలో ఎలాంటి కూల్చివేతలు వుండవని, ప్రజలు భయపడవలసిన అవసరం లేదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని,పేదల ఇళ్లు కూల్చివేత జరగదన్నారు.

 Suryapet Has Nothing To Do With Hydra Patel Ramesh Reddy , Hydra Patel Ramesh Re-TeluguStop.com

సూర్యాపేటకు హైడ్రాతో సంబంధం లేదని,హైడ్రా కేవలం ఓఆర్ఆర్ లోపల మాత్రమే పనిచేస్తుందని, జిల్లాలతో హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు.సూర్యాపేటలో ఎఫ్టీఎల్,బఫర్ జోన్ ల సర్వే చేయమని ప్రభుత్వం నుండి ఆదేశాలు లేవన్నారు.

బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించి,భయాందోళనకు గురిచేస్తున్నారని,పేదలు భయపడవలసిన అవసరం లేదని,వారికి కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుందన్నారు.భవిష్యత్తులో హైదరాబాదులో వరదలు వచ్చినప్పుడు కాలనీలు మునిగిపోకుండా వుండడానికి హైడ్రా చెరువుల పరిరక్షణ కార్యక్రమం చేపట్టిందని, సూర్యాపేటలో పేదల ఇళ్ల కూల్చివేతలు వుండవని,సద్దల చెరువు,పుల్లారెడ్డి చెరువులకు ఇప్పటికే చెరువు కట్టల నిర్మాణం జరిగిందని,చెరువు కట్టల బయట జరిగిన నిర్మాణాలు కూల్చడం జరగదన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, సూర్యాపేటలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం,రేషన్ కార్డుల మంజూరు చేస్తామన్నారు.మూసినది పరివాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తుందన్నారు.

సూర్యాపేట ఏరియా ఆసుపత్రిని 1000 పడకల ఆసుపత్రిగా మారుస్తామని,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు.తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత సద్దల చెరువు సుందరీకరణ, పార్క్ ల నిర్మాణం కోసం పది కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు.ఉర్లుగొండ దేవాలయ అభివృద్ధి కోసం రూ.3 కోట్లు, పిల్లలమర్రి శివాలయం అభివృద్ధి కోసం రూ.2.50కోట్లు కేటాయించినట్లు చెప్పారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube