షీ టీమ్స్ పై విద్యార్ధినిలకు అవగాహన సదస్సు

సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్చార్జి సూర్యాపేట డిఎస్పి పరికే నాగభూషణం ఆధ్వర్యంలో చివ్వెంల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్ గురించి,సైబర్ నేరాలపై,మానవ అక్రమ రవాణా గురించి, మహిళలు మరియు పిల్లల భద్రత గురించి,పోలీస్ కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 Awareness Conference For Students On She Teams , She Teams , Suryapet Dsp , Naga-TeluguStop.com

ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం చేత షీ టీమ్స్,మహిళల భద్రత రక్షణ,మానవ అక్రమ రవాణా,లింగ వివక్షత, 100 డయల్,సోషల్ మీడియా,ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాలు,టోల్ ఫ్రీ నెంబర్ 1930,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల వంటి అంశాలపై ఆట, పాటల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అవగాహనకల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట షీ టీం ఏఎస్ఐ పాండు నాయక్,షీ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జాఫర్, హెడ్ కానిస్టేబుల్ యల్లారెడ్డి,కానిస్టేబుల్ శివరాం,పోలీస్ సిబ్బంది, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య,గోపయ్య,చారి, నాగార్జున,కృష్ణ , గురులింగం మరియు పాఠశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube