సూర్యాపేట జిల్లా: జిల్లాలో రైతుల సౌకర్యార్థం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.
గురువారం కలెక్టరేట్ లో సమావేశ మందిరం పక్కన కంట్రోల్ రూమ్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు,సందేహాలు, ఇబ్బందులు ఎదురైనా సలహాల కొరకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 6281492368 కాల్ చేసి సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు.
కంట్రోల్ రూమ్ నందు అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్.మోహన్ రావు, సివిల్ సప్లై ఎండి రాంపతి, సిబ్బంది పాల్గొన్నారు.